Wednesday, November 20, 2024

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. నేటి బంగారం ధరలు ఇలా..

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్. బంగారం ధర వరుసగా రెండో రోజు తగ్గింది. ఇది పసిడి ప్రియులకు ఊరట కలిగించే అంశం. పసిడి బాటలోనే వెండి కూడా దిగివచ్చింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 దిగొచ్చింది. దీంతో బంగారం ధర రూ.48,660కు తగ్గింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. రూ.200 తగ్గుదలతో రూ.44,600కు క్షీణించింది. ఇక, వెండి రేటు కూడా బంగారం దారిలోనే పయనించింది. వెండి రేటు రూ.600 పతనమైంది. దీంతో కేజీ వెండి ధర రూ.71,700కు దిగొచ్చింది.

ఇది కూడా చదవండిః మీరాభాయ్ చానుకి మోదీ సహాయం: రహస్యం బయటపెట్టిన మణిపూర్ సీఎం

Advertisement

తాజా వార్తలు

Advertisement