Saturday, November 23, 2024

రూ.310త‌గ్గిన బంగారం ధ‌ర‌.. భారీగా త‌గ్గిన వెండి

నేడు బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ. 310 తగ్గి రూ.49,990కి దిగొచ్చింది. అంతకుముందు గరిష్టంగా రూ. 50,330 వద్ద ఉండటం గమనార్హం. ఇక 24 క్యారెట్లకు చెందిన తులం గోల్డ్ రేటు రూ.350 తగ్గి రూ.54,530కి పతనమైంది. ఇక దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.50,140 వద్ద ఉండగా. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,670 వద్ద ట్రేడవుతోంది. సిల్వర్ ధర కూడా భారీగా తగ్గింది. హైదరాబాద్‌లో కిలో వెండి రేటు భారీగా పతనమైంది.

ఒక్కరోజే రూ.1300 మేర పతనమై.. రూ.72700కు చేరింది. దిల్లీలో కిలో వెండి రేటు రూ.500 పతనమై.. రూ.70,500కు చేరింది. అంతకుముందు వారంలో ఏకంగా రూ.5,500 మేర సిల్వర్ ధర పెరిగింది.వడ్డీ రేట్లు పెంచిన నేపథ్యంలో డాలర్ పుంజుకుంటోంది. ఇటీవల భారీగా తగ్గిన డాలర్ విలువ ఇప్పుడు మాత్రం గరిష్టాలకు చేరుకుంది. దీంతో రూపాయి సహా ఇతర దేశాల కరెన్సీలు కుప్పకూలుతున్నాయి. ఆసియా దేశాల కరెన్సీలు బాగా పడిపోతున్నాయి. కొద్దిరోజుల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వడ్డీ రేట్లను పెంచింది. 35 బేసిస్ పాయింట్ల మేర పెంచగా మొత్తం రెపో రేటు 6.25 శాతానికి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement