బంగారం కొనాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. గత రెండు రోజులుగా పడిపోతూ వచ్చిన పసిడి రేటు ఈరోజు మాత్రం పైకి కదిలింది. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా నడిచింది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరుగుదలతో రూ.47,510కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.140 పెరుగుదలతో రూ.43,550కు ఎగసింది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,510 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,860 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,750కి చేరింది.
మరోవైపు వెండి రేటు కూడా బంగారం దారిలో పయనించింది. వెండి ధర రూ.200 పైకి కదిలింది. దీంతో కేజీ వెండి ధర రూ.71,900కు ఎగసింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,200 ఉండగా, ముంబైలో రూ.67,200 ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.67,200 ఉండగా, కోల్‌కతాలో రూ.67,200కి చేరింది.