Saturday, November 23, 2024

మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

దేశంలో మరోసారి బంగారం ధరలు పెరుగదల బాట పట్టినట్లే అనిపిస్తోంది. ఇవాళ మరోసారి బంగారం ధరలు పెరిగాయి. బంగారం ధరలు మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పెరిగాయి. కొన్ని రోజులుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. అయితే గత వారం రోజుల నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఈరోజు పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెరిగి రూ. 44,250 కి చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెరిగి రూ. 48,270 కి చేరింది. బంగారం ధరలు పెరిగితే.. వెండి ధరలు కూడా అదే దారి పట్టాయి. కిలో వెండి ధర రూ. 40 పెరిగి రూ. 66,700 పలుకుతుంది.

ఇది కూడా చదవండి: ఏపీలో టెన్త్‌ పాసైన విద్యార్ధులకు మైగ్రేషన్ సర్టిఫికేట్

Advertisement

తాజా వార్తలు

Advertisement