Monday, November 18, 2024

పెరిగిన బంగారం ధ‌ర‌.. గ‌రిష్ట‌స్థాయికి చేరిన వెండి

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో బంగారం 22 క్యారెట్లకు 10 గ్రాములకు రూ.300 మేర పెరిగింది. ప్రస్తుతం రూ.55 వేల 700 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ తులానికి రూ.330 మేర ఎగబాకింది. ప్రస్తుతం రూ.60 వేల 760కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో చూసుకున్నట్లయితే 22 క్యారెట్ల బంగారం తులానికి రూ.300 మేర పెరిగి ప్రస్తుతం రూ.55,850 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం ఢిల్లీలో రూ.330 మేర పెరిగింది. ప్రస్తుతం రూ.60 వేల 910 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికి వస్తే వరుసగా పెరుతూ 32 వారాల గరిష్ఠ స్థాయిని తాకింది. వారం రోజులుగా కిలో వెండి రేటు (Silver Price Today) రూ.80 వేల పైనే ట్రేడవుతోంది. ఇవాళ చూసుకుంటే హైదరాబాద్‌లో కిలో వెండిపై రూ.400 మేర పెరిగి రూ.80 వేల 400 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రేటు రూ.300 పెరిగింది. ప్రస్తుతం కిలో ధర రూ.76 వేల 600 పలుకుతోంది. ఢిల్లీ, హైదరాబాద్‌ మధ్య ధరల్లో చాలా తేడా ఉంటుంది. హైదరాబాద్‌లో వెండి రేటు ఎక్కువుంటే, ఢిల్లీలో బంగారం రేటు అధికంగా ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement