Tuesday, November 26, 2024

మ‌ళ్లీ పెరిగిన బంగారం ధ‌ర‌.. భారీగా పెరిగిన వెండి

నేడు బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. దేశీయంగా చూస్తే తాజాగా బంగారం ధర మళ్లీ పెరిగింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.150 మేర పెరిగింది. దీంతో ప్రస్తుతం రూ.49,900కు చేరింది. గత 10 రోజుల్లో ఏకంగా రూ. 1000కిపైగా ధర పెరిగింది. ఈ మధ్యలో ఒక్కసారి మాత్రమే తగ్గడం గమనార్హం. ఇక 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల పసిడి రేటు హైదరాబాద్‌లో రూ.160 పెరిగి రూ.54,440కి పెరిగింది. ఢిల్లీలో చూస్తే 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.50 వేల మార్కు దాటింది. అక్కడ 10 గ్రాముల గోల్డ్ 22 క్యారెట్లకు రూ.50,050కి చేరింది.

ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర తులానికి రూ.150 పెరిగి రూ.54,590కి పెరిగింది. ఇక వెండి విషయానికి వస్తే 4 రోజుల్లోనే ఏకంగా రూ.2200 మేర ఎగబాకింది. తాజాగా రూ.500 పెరిగి హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ.73 వేల మార్కుకు చేరింది. ఇక 10 రోజుల్లో చూసుకుంటే గనుక ఏకంగా రూ.3200 పెరిగింది. సిల్వర్ రేటు హైదరాబాద్‌తో పోలిస్తే దిల్లీ కాస్త తక్కువే ఉంటుంది. దేశ రాజధానిలో కేజీ వెండి రూ.500 పెరిగి రూ.68,100 వద్ద కొనసాగుతోంది. బంగారం, వెండి రేట్లు ప్రాంతాలను బట్టి, పరిస్థితులను బట్టి మారుతుంటాయి. స్థానిక పన్నుల ఆధారంగా స్వల్ప హెచ్చుతగ్గులు ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement