బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్. నిన్న తగ్గిన బంగారం ధర ఈరోజు పరుగులు పెట్టింది. అయితే, వెండి రేటు మాత్రం స్థిరంగా కొనసాగింది. హైదరాబాద్ మార్కెట్ లో శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 మేర పరుగులు పెట్టింది. దీంతో బంగారం ధర రూ. 52,040కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 పెరుగుదలతో రూ. 47,700కు ఎగసింది. ఇక, వెండి ధర మాత్రం రూ. 72,500 వద్దనే స్థిరంగా ఉంది.
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,600గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,700గా ఉంది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. వెండి ధర మాత్రం రూ. 72,500 వద్ద కొనసాగుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,700 ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,040గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,700 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,040గా ఉంది.