Friday, November 22, 2024

GOLD RATE: మహిళలకు గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారు ఏమాత్రం ఆలస్యం చేయోద్దు. గత రెండు రోజులుగా బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఈ వారంలో బంగారం ధర వెయ్యి రూపాయల పైనే తగ్గింది. ఆదివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.200 తగ్గింది. దీంతో పసిడి ధర రూ.46,250గా నమోదైంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.220 తగ్గుదలతో రూ.50,450కు పడిపోయింది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం రూ.300 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.63,700కి చేరింది. ఏపీలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement