Saturday, November 23, 2024

బంగారంతో మాస్క్..అంద‌రి క‌ళ్ళు అత‌నిపైనే..

క‌రోనాకి విరుగుడుగా వ్యాక్సిన్ వ‌చ్చింది. క‌రోనా సోక‌కుండా మాస్క్ లు,శానిటైజ‌ర్ల‌కి విప‌రీత‌మైన డిమాండ్ పెరిగింది. శానిటైజ‌ర్ ల‌తో పాటు మాస్క్ ల‌లో కూడా ఎన్నో ర‌కాలు మార్కెట్ల‌ల‌లో ల‌భ్య‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే ఎన్95, కాటన్ మాస్కులు, డిజైనర్ మాస్కులు, ప్రింటెడ్ మాస్కులు ఇలా ఎన్నో వచ్చాయి. అయితే వీటన్నింటిని మించిపోయేలా బంగారం మాస్కు వచ్చింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ వ్యాపారవేత్త బంగారం మాస్కు ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు.ఈ బంగారం మాస్కు ఫొటోలను ఓ మహిళా జర్నలిస్టు సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ విషయం వైరల్ అయింది. చందన్ దాస్ అనే నగల డిజైనర్ సాయంతో తనకిష్టమైన విధంగా బంగారంతో ఆ మాస్కును తయారుచేయించుకున్న ఆ బిజినెస్ మేన్ ఇప్పుడు ఎక్కడికెళ్లినా అందరి కళ్లు అతడిపైనే ప‌డుతున్నాయి. ఈ మాస్కు కోసం 108 గ్రాముల బంగారాన్ని వినియోగించారు. దీని ఖరీదు రూ.5.70 లక్షలు. కోల్ కతాలో దుర్గాపూజ సందర్భంగా ఈ గోల్డెన్ మాస్కుతో వచ్చిన వ్యాపారవేత్తను చూసేందుకు జనం ఎగబడ్డారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement