దేశంలో ధరల పెరుగుదలకు బ్రేకులు పడడం లేదు. ఇప్పటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ తోపాటు నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇప్పుడు బంగారం రేటు జిగేల్ మంది. పసిడి ధర దూసుకుపోతోంది. వరుసగా రెండో రోజు బంగారం, వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.400 పెరిగింది. దీంతో పసిడి రేటు రూ. 52,100కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 పెరుగుదలతో రూ. 47,750కు పెరిగింది. ఇక, వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఏకంగా రూ.800 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 73,400కు ఎగసింది. బంగారం, వెండి కొనాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు.
Gold Rate: దేశంలో పసిడి పరుగులు.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
Advertisement
తాజా వార్తలు
Advertisement