బంగారాన్ని కొనాలనుకుంటున్నారా ? అయితే ఇదే మంచి అవకాశం. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు మాత్రం నిలకడగానే కొనసాగింది. పసిడి రేటులో ఎలాంటి మార్పు లేదు. వెండి రేటు మాత్రం భారీగా పడిపోయింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్ లో సోమవారం బంగారం ధర నిలకడగానే ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,780 వద్దనే నిలకడగా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,800 వద్ద స్థిరంగా ఉంది. మరోవైపు బంగారం ధర నిలకడగా ఉంటే.. వెండి రేటు మాత్రం భారీగా పడిపోయింది. వెండి ధర కేజీకి రూ.1200 తగ్గుదలతో రూ.72,800కు పతనమైంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement