బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి శుభవార్త. బంగారం ధరలు భారీగా తగ్గింది. నిన్న స్థిరంగా కొనసాగిన పడిసి రేటు ఈరోజు మాత్రం పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.750 తగ్గింది. దీంతో బంగారం ధర రూ.49,150కి క్షిణించింది. ఇక, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.690 తగ్గుదలతో రూ.45,050కి చేరింది.
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 49,150 వద్ద ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,050 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,500 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ. 47,200కి చేరింది.
బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా పయనించింది. వెండి రేటు భారీగా పడిపోయింది. వెండి ధర ఏకంగా రూ.900 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.69,500కి చేరింది. బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది తీపికబురు అని చెప్పొచ్చు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..