బంగారం ధరలు పరుగులు పెట్టింది. గత రెండు రోజులుగా ధరలు భారీగా పెగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.760 పెరిగింది. దీంతో బంగారం ధర రూ.50,070కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.700 పెరుగుదలతో రూ.45,900కు ఎగసింది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,900 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,070 కి చేరింది. ఢిల్లీ నగరంలో నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,050 గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,420 కి చేరింది. ఇక, బంగారం ధర పెరిగితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఏకంగా రూ.1300 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.70,600కి చేరింది.
ఇది కూడా చదవండి: బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్.. తెలంగాణలో వరి కోసం పోరు
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily