Friday, November 22, 2024

Gold Price: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రెట్లు ఇలా..

పసిడి ప్రియులకు శుభవార్త. గత రెండు రోజులుగా తగ్గుతున్న  బంగారం ధరలు.. నేడు కూడా పడిపోయింది. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా నడిచింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.350 దిగొచ్చింది. దీంతో బంగారం ధర రూ. 44,600కు తగ్గింది. అదే సమయంలో 10 గ్రాముల  24 క్యారెట్ల బంగారం ధర రూ. 390 తగ్గుదలతో రూ. 48,650కు చేరింది. ఇక, వెండి ధర రూ. 900 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ. 64,500కు చేరింది.

విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,600 ఉండగా.. 10 గ్రాముల  24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,650కు ఉంది. కేజీ వెండి ధర రూ. 64,500వద్ద కొనసాగుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,750 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 51,000గా నమోదైంది. అలాగే కిలో వెండి ధ‌ర రూ. 60,400గా ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,510 వద్ద కొనసాగుతోంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,510కి చేరింది.
ఇక, కిలో వెండి ధ‌ర రూ. 60,400గా ఉంది.

కోల్‌క‌త్తాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధ‌ర రూ. 46, 750గా ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధ‌ర రూ. 49, 450కి క్షిణించింది. కిలో వెండి ధర రూ. 60, 400గా ఉంది.

- Advertisement -

బెంగ‌ళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధ‌ర రూ. 44,600గా ఉండాగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధ‌ర రూ. 48,650గా ఉంది. అలాగే కిలో వెండి ధ‌ర రూ. 60,400 గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement