Monday, November 18, 2024

మహిళలకు గుడ్ న్యూస్.. దిగొచ్చిన పసిడి ధర

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్.. నిన్నటి వరకు పరుగులు పెట్టిన బంగారం ధరలు ఈ రోజు దిగి వచ్చాయి.. బంగారం ధర పడిపోయింది.. పసిడి రేటు వెలవెలబోతోంది. నిన్నటితో పోల్చుకుంటే.. శనివారం ఉదయం బంగారం ధరలు నెల వైపు చూస్తున్నాయి. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.45,060కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.46,060కు చేరింది.

దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. దేశీయ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,360 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.50,580కు చేరింది. ముంబై మార్కెట్లో సైతం బంగారం ధరలలో మార్పులు జరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.45,060 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.46,060 ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ 44,950 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.49,040 గా ఉంది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.44,800 ఉండగా10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.48,870గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,800 ఉండగా. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.48,870గా ఉంది.

ఇక పసిడి బాటలోనే వెండి కూడా భారీగానే పతనమైంది. శనివారం వెండి ధర కూడా దిగొచ్చింది. దీంతో వెండి కొనాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే విషయమని చెప్పుకోవచ్చు. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల వెండి రూ.689గా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.68,900కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల ధర రూ.689 ఉండగా.. కేజీ ధర రూ.68,900గా ఉంది. ముంబైలో 10 గ్రాముల సిల్వర్ రూ.689గా ఉండగా.. కిలో వెండి రూ.68,900గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల ధర రూ.743 ఉండగా.. కిలో వెండి రూ.74,300కు చేరింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల వెండి ధర రూ.743 ఉండగా.. కేజీ వెండి ధర రూ.74,300గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల వెండి ధర రూ.743 ఉండగా.. కిలో వెండి ధర రూ.74,300గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement