Wednesday, November 20, 2024

Gold News: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగురాష్ట్రాల్లో రేట్లు ఇవీ..

పసిడి ప్రియులకు గుడ్‌ న్యూస్. బంగారం ధర మరోసారి స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర రూ. 110 తగ్గింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,500కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,550కు దిగొచ్చింది.

పసిడి ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర రూ. 300 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.64,300కు చేరింది.

విజ‌య‌వాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 44,500గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,5500 కి చేరింది. అలాగే కిలో వెండి ధ‌ర రూ. 64,30గా ఉంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,760గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 51,010 కి చేరింది. కిలో వెండి ధ‌ర రూ. 60,400గా నమోదైంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,610గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,610కి చేరింది. అలాగే కిలో వెండి ధ‌ర రూ. 60,400 వద్ద కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement