Thursday, November 21, 2024

Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్.. స్వ‌ల్పంగా బంగారం.. భారీగా త‌గ్గిన వెండి ధ‌ర‌లు

పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్. బంగారం ధర ఈరోజు తగ్గింది. వెండి రేటు కూడా పడిసి దారిలో పయనించింది. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 తగ్గింది. దీంతో బంగారం ధర రూ. 44,950కు చేరింది. అదే సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 210 తగ్గుదలతో రూ. 49,040కు క్షీణించింది. ఇక, వెండి ధర రూ. 700 పడిపోయింది. దీంతో కేజీ వెండి ధర రూ. 65,400కు చేరింది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,950గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,040గా ఉంది. అలాగే ఒక కిలో వెండి ధ‌ర రూ. 65,400గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100 ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,400గా ఉంది. అలాగే కిలో వెండి ధ‌ర రూ. 60,600 వద్ద కొనసాగుతోంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,830 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,830గా ఉంది. కిలో వెండి ధ‌ర రూ. 60,600కి చేరింది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,750గా ఉంది. కిలో వెండి ధ‌ర రూ. 60,600 గా ఉంది.

- Advertisement -

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,040కి చేరింది. అలాగే కిలో వెండి ధ‌ర రూ. 60,600 వద్ద కొనసాగుతోంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,170 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,230గా ఉంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement