బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్. తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని ప్రధాన నగరాల్లో బుధవారం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.430 తగ్గింది. దీంతో రూ.49,420కు దిగొచ్చింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 తగ్గుదలతో రూ.45,300కు క్షీణించింది. వెండి ధర రూ.700 తగ్గడంతో రూ.65,200కు చేరింది.
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,420 కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,300గా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 65,200 వద్ద కొనసాగుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,700 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,450గా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 61,400 గా నమోదైంది.
దేశ ఆర్థక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,410 కి చేరింది. 22 క్యారెట్ల 10 బంగారం ధర రూ. 47,410గా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 61,400 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,420కు దిగొచ్చింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,300కు తగ్గింది. వెండి ధర రూ.61,400కు చేరింది.
కాగా, గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈరోజు భారీగా తగ్గడంతో బంగారం కొనుగోలు దారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పసిడి కొనుగోలుదారులకు ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు.