బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. గురువారం బంగారం, వెండి ధరలు పడిపోయాయి. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం 24 క్యారెట్ల బంగారం ధర రూ.260 పడిపోయింది. దీంతో ఈరోజు రూ.49,100కు క్షిణించింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గుదలతో రూ.45 వేలకు చేరింది. ఇక, బంగారం దారిలోని వెండి రేటు కూడా పయనించింది. వెండి ధర రూ.700 తగ్గుదలతో రూ.64,600కి చేరింది. ఇక, ఏపీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,100 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.45 వేల వద్ద కొనసాగుతోంది.
మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.280 తగ్గుదలతో రూ.51,430కు పడిపోయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గి రూ.47,150కు చేరింది. వెండి రూ.600 తగ్గుదలతో రూ.60,900కు క్షిణించింది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,100 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.45 వేలుగా ఉంది.
బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం.