Saturday, November 23, 2024

Hyderabad: గోల్కొండ మెట్లబావికి యునెస్కో అవార్డు.. సాంస్కృతిక వారసత్వ సంపద పరిరక్షణకు చర్యలు

హైదరాబాద్​ గోల్కొండలోని కుతుబ్​షాహీ సమాధుల వద్ద ఉన్న మెట్లబావికి యునెస్కో అవార్డు దక్కింది. ఇవ్వాల (ఆదివారం) బ్యాంకాక్​లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ అవార్డుని ప్రకటించారు. సాంస్కృతిక వారసత్వ సంరక్షణ కోసం యునెస్కో ఆసియా పసిఫిక్​ అవార్డులలో మెట్ల బావికి అవకాశం దక్కడంపై హైదరాబాదీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీని డెవలప్​మెంట్​ కోసం ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నాయి. ఒక దశాబ్దానికి పైగా చేపట్టిన పనుల తర్వాత హైదరాబాద్‌లోని చారిత్రాత్మక కుతుబ్ షా సమాధులలో స్టెప్‌వెల్స్ ని పునరుద్ధరించారు.

కాగా, సెప్టెంబరులో మంత్రి కేటీ రామారావు (కేటీఆర్​) కుతుబ్ షాహీ సమాధుల వద్ద స్టెప్‌వెల్స్ (బావోలిస్) ను ప్రారంభించారు. భవిష్యత్తులో యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు కోసం తాము తప్పకుండా దరఖాస్తు చేస్తామని ఆయన ఈ సందర్భంగా అన్నారు. కుతుబ్ షాహీ సమాధుల వద్ద ఈ వారసత్వ ప్రదేశాలను కాపాడడంలో ఆగాఖాన్​ ట్రస్ట్​ ఫర్​ కల్చర్​ (AKTC) ఎంతో మంచి పనులు  చేసిందన్నారు. సంస్కృతి, వారసత్వాన్ని చెక్కుచెదరకుండా ఉంచడం చాలా ముఖ్యం అని మంత్రి కేటీఆర్​ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement