గోకుల్‌రాజ్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు ధీరన్ చిన్నమలై గౌండర్ పేరవై వ్యవస్థాపకుడు యువరాజ్‌కు మదురై ప్రత్యేక సెషన్స్ కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. ప్రధాన నిందితుడు ఎస్ యువరాజ్‌కు మూడు కేసుల్లో జీవిత ఖైదు విధించారు. మొత్తం 10 మంది నిందితులకు శిక్ష విధించింది కోర్టు. దళిత ఇంజినీరింగ్ విద్యార్థి గోకుల్‌రాజ్ 2015, జూన్ 23 అదృశ్యమయ్యాడు. అతను చివరిసారిగా తిరుచెంగోడ్‌లోని అర్థనారీశ్వర దేవాలయంలో మహిళా స్నేహితుడితో కలిసి కనిపించాడు. ఆ తర్వాత తమిళనాడులోని నమక్కల్ జిల్లాలో రైలు పట్టాల వద్ద అతని తల లేని డెడ్‌బాడీ లభ్యమైంది.
కాగా, ఆ మహిళ గౌండర్ వర్గానికి చెందినదిగా గుర్తించారు. విచారణలో కొంగు వెల్లలార్ గౌండర్ కుల సంఘం అధ్యక్షుడు ఎస్ యువరాజ్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు సమాచారం లభించింది. దళిత యువకుడిపై ‘పరువు హత్య’ కేసులో యువరాజ్ సహా 16 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 10 మంది నిందితులను సెషన్స్ కోర్టు మార్చి 5న దోషులుగా నిర్ధారించింది. ఈ కేసును తొలుత అనుమానాస్పద మృతిగా భావించి, పోస్టుమార్టంలో గొంతుకోసి హత్య చేసినట్లు తేలిన తర్వాత హత్యగా మార్చారు.
నిందితులు 21 ఏళ్ల యువకుడిని చంపడానికి ముందు ఒక మానిప్యులేటివ్ వీడియో, చేతితో రాసిన డెత్ నోట్‌ను సృష్టించారు. యువరాజ్‌కు మూడు కేసుల్లో జీవిత ఖైదు, ఎటువంటి ఉపశమనం లేకుండా మరణశిక్ష విధించగా, అరుణ్, కుమార్ అలియాస్ శివకుమార్, సతీష్, రఘు, రంజిత్ మరియు సెల్వరాజ్‌లకు ఒక్కొక్కరికి రెండు జీవిత ఖైదులు విధించారు. చంద్రశేఖర్, శ్రీధర్, గిరిధర్‌లకు జీవిత ఖైదు పడింది. యువరాజ్ తలదాచుకోవడానికి సహకరించినందుకు శ్రీధర్, గిరిధర్‌లకు జీవిత ఖైదుతోపాటు ఐదేళ్ల జైలుశిక్ష పడింది.