Tuesday, November 26, 2024

నామకరణానికి వెళుతుంటే…

బావిలోకి దూసుకెళ్లిన కారు.. తల్లీ కొడుకుల మృతి
రక్షించబోయిన గజ ఈతగాడు మృత్యువాత..
సిద్దిపేట జిల్లాలో విషాదం


దుబ్బాక, ప్రభన్యూస్ : సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్‌ శివార్లలోని ఓ వ్యవసాయ బావిలోకి కారు దూసుకెళ్ళి తల్లీ కొడుకులు మరణించారు. వీరి కారును బయటకు తీసే క్రమంలో ప్రమాదవశాత్తు నీళ్ళలోకి జారిపడి గజ ఈతగాడు కూడా మరణించిన విషాద సంఘ టన చోటుచేసుకుంది. బుధవారం మధ్యాహ్నం బావిలో కారు పడిన ప్పటి నుంచి సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు, అగ్నిమా పక సిబ్బంది, స్థానికులు, గజ ఈతగాళ్ళు రాత్రి ఎని మిది గం టల వరకు కష్టపడి కారును బ యటకు తీశారు. ఈ సంఘటన కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్‌ జిల్లా నిజాంపేట మండలం (పూర్వపు రామా యంపేట మండలం) నందిగామ గ్రామానికి చెందిన ఆకుల రాము లు భార్య భాగ్యలక్ష్మి, కుమారుడు ప్రశాంత్‌ బుధవారం హుస్నాబాద్‌ లో తమ కూతురు ఇంట్లో నామకరణ కార్యక్రమానికి వెళుతున్నారు. తండ్రి రాములు వృత్తి రీత్యా లారీ డ్రైవర్‌. ప్రస్తుతం వడ్ల సేకరణకు లారీలు తిరగాల్సిన పరిస్థితుల్లో అతనికి సెలవు దొరకలేదు. యధావిధిగా అత ను మెదక్‌ జిల్లా పాతూరు సమీపంలోని రాయిన్‌పల్లికి వడ్ల తీసుకొ చ్చేందుకు వెళ్ళాడు. ఇటు కూతురు ఇంట శుభకార్యానికి అతని భార్య భాగ్యలక్ష్మి, కుమారుడు ప్రశాంత్‌ వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ప్రశాంత్‌ అదే గ్రామానికి చెందిన తన మిత్రుడు హరికృష్ణ కారు (ఏపీ 23 ఆర్‌ 5566) తీసుకొని నంది గామ నుంచి బయలు దేరారు. చిట్టాపూర్‌ గ్రామ సమీపంలో శీర్క వాగు ప్రాంతం (బ్రిడ్జి వద్ద కు రాగానే) కారు టైరు పంక్చర్‌ అయ్యి, అదుపుతప్పి, రోడ్డు కింద కు దూసుకొచ్చింది. కారును అదుపు చేసేలోగా రోడ్డు పక్కన ఉ న్న బావిలో పడిపోయింది. కారు టైర్‌ పంక్చర్‌ కావడం, రోడ్డుపై గీసుకుని కారు నుంచి చక్రం విడిపో వడంతో భారీ శబ్ధం వినిపించడంతో స్థానికులు పోలీసులకు సమా చారం ఇచ్చారు. భూంపల్లి ఎస్‌ఐ సర్దార్‌ జమాల్‌, దుబ్బాక సర్కిల్‌ ఇన్‌ స్పెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని కారును బయటకు తీసే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రత్యేక మోటార్ల ద్వారా నీటిని బయటకు తోడేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ లోగా దుబ్బాక నుంచి అగ్నిమాపక సిబ్బంది కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గజ ఈతగాళ్ళను రప్పించి, గాలింపు చర్యలు మొదలు పెట్టారు. దాదాపు 40 నుంచి 60 అడుగుల వరకు నీరు ఉండ టంతో నీటిని బయటకు తోడిపోసేందుకు రాత్రి 8 గంటల వరకు మోటార్లు వాడుతూనే ఉన్నారు. ఈలోగా నీరు కొంత మేర తగ్గడంతో ప్రత్యేకంగా తెప్పించిన క్రేన్ల సాయంతో గజ ఈతగాళ్ళు బావిలోకి దిగి, కారుకు తాళ్ళు కట్టి పైకి లాగారు. సహాయక చర్యలను దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు అక్కడే ఉండి పర్యవేక్షించారు. రాత్రి 8-30 గంటల ప్రాంతంలో కారును పైకి లాగ గలిగారు.


సహాయక చర్యల్లో పాల్గొన్న గజ ఈతగాడు మృతి
కారును నీటిలోంచి పైకి తీసే క్రమంలో సహాయక చర్యల్లో పాల్గొన్న ఎనగుర్తి గ్రామానికి చెం దిన బండగారి నర్సింహులు అనే గజ ఈతగాడు ప్రమాదానికి గురై మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. కారును పైకి లాగేందుకు క్రేన్‌ తాళ్ళకు మరో తాడును కారుకు తగిలించే క్రమంలో నీళ్ళలోకి దిగిన నర్సింహులు కాలు కారు టైర్‌లో ఇరుక్కుపోయింది. తను ఎంత గింజుకున్నప్పటికీ అతను నీళ్ళలో ఉన్న కారణంగా అతను బయటకు కనిపించకపోవడం, అతని మాటలు బయటకు వినపడక పోవడం, తనకు తాను నీళ్ళలోంచి రక్షిం చుకోలేక చనిపోయాడు. మరో వైపు బయట ఉన్న వారికి ఈ విషయం తెలియక, అతను మరో వైపు ఉన్నాడేమోననుకుని కారు ను లాగేందుకు క్రేన్‌ ఉపయోగించా రు. కారు పైకి వస్తున్న కొద్దీ కారుతో పాటే గజ ఈతగాడు కూడా శవంగా పైకి రావడం గమనించి, అతను చని పోయాడని నిర్ధారించుకు న్నారు. కారును ఒడ్డుకు తెస్తుండగా నర్సిం హులు శవం మళ్ళీ బావిలోకి పడి పోయింది. కారు అద్దం పగిలి పోయి ఉండటంతో పాటు, ఒక వై పు డోర్‌ కూడా తెరిచినట్లు ఉంది. కారులో ఒక్కరి శవమే ఉన్నట్లు మరో శవం బావిలో పడిపోయి ఉన్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలకు వెళ్ళిన వారిలో ఒకరు చనిపోవడంతో ఈ ప్రాంతం విషాద మయమైంది. ప్రస్తుతం బావిలోంచి శవాలను తీసేందుకు గజ ఈతగాళ్ళు కూడా ధైర్యం చాలక మళ్ళీ బావిలో దిగలేక పోయారు. మరో వైపు బావిలో నీరు మళ్ళీ ఊ రుతోంది. మరుసటి రోజైన గురువారం ఉదయానికి గానీ సహాయక చర్యలు చేపట్టే పరిస్థితి కనిపించడం లేదు. బావిలో ముళ్ళ చెట్లు ఉం డటంతో సహాయ చర్యలు చేపట్టడం కష్టంగా ఉందని పోలీసులు అంటు న్నారు. గజ ఈతగాడు నర్సింలు మరణ వార్త తెలుసుకున్న గ్రామస్తు లు ఘటనా స్థలానికి చేరుకుని, అతని కుటుంబానికి న్యాయం చేయా లంటూ రామాయంపేట- సిద్దిపేట రహదారిపై ధర్నా చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement