Tuesday, November 26, 2024

భారీ కొండ చిలువ‌-చేతితో లాగిన‌ వ్య‌క్తి- వీడియో షేర్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి

ఐఎఫ్ ఎస్ అధికారి ప‌ర్వీన్ కాశ్వాన్ షేర్ చేసిన వీడియో తెగ వైర‌ల్ అవుతోంది. దక్షిణ భారత దేశంలోని ఓ వ్యన్యప్రాణి అభయారణ్యంలో తీసిన వీడియో ఇది. చిన్న‌పాటి అటవీ ప్రాంతం.. ఆ మార్గం నుంచి కొందరు ఓ వాహనంలో వెళుతున్నారు. మధ్యలో ఓ పెద్ద కొండ చిలువ. రోడ్డుకు అడ్డంగా పడుకుని ఉంది. దాని జోలికి వెళితే మన పని అంతే అన్నంత పెద్దగా ఉంది. సాధారణంగా హారన్ కొట్టడం, కాస్త దగ్గరగా వాహనాన్ని తీసుకెళ్లడం వంటి చేస్తే రోడ్డు మీద నుంచి పాము వెళ్లిపోతుంది. కానీ అలా చేసినా ఆ కొండ చిలువ అలాగే పడుకుని ఉంది. ఇంతలో వాహనంలోంచి ఓ వ్యక్తి ధైర్యంగా దిగి కొండ చిలువ దగ్గరికి వెళ్లాడు.దాని తోక భాగం వైపు వెళ్లిన వ్యక్తి.. కర్ర వంటిదేమీ లేకుండా ఉత్త చేతులతోనే కొండ చిలువను పట్టుకుని లాగేయడం మొదలుపెట్టాడు. వాహనంలోని వారు వద్దు వద్దని గట్టిగా అరుస్తున్నా వెనక్కి తగ్గలేదు. తోక పట్టుకోగానే కొండ చిలువ ఒక్కసారిగా ఆ వ్యక్తి వైపు వెనక్కి తిరిగింది. కరవడానికి సిద్ధమైంది. అయినా అతను భయపడలేదు. తోక పట్టుకుని గట్టిగా లాగి రోడ్డు పక్కకు పడేశాడు. ఆ వెంటనే కొండ చిలువ వేగంగా పొదల్లోకి పారిపోయింది. వన్యప్రాణులు ఉండే చోటికి వెళ్లినప్పుడు.. వాటిని డిస్టర్బ్ చేయకుండా, రోడ్డు ప్రమాదానికి లోను కాకుండా కాపాడారు అని క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోకు వేల కొద్దీ వ్యూస్, పెద్ద సంఖ్యలో లైకులు వస్తున్నాయి. పాముపై నుంచి వాహనాలు వెళితే చనిపోకుండా రక్షించడం చాలా బాగుందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. వామ్మో అలా చేత్తో అంత పెద్ద పామును పట్టుకుని జరపడం ఏమిటి అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే.. ‘‘తాను మంచిపనే చేశాడని, కానీ మరీ ఎక్కువ రిస్క్ తీసుకున్నట్టు ఉంది. ఏదైనా కర్రతో కదిపితే సరిపోయేది అని మరికొందరు కామెంట్స్ పెట్టారు.

https://twitter.com/ParveenKaswan/status/1575693899212824576
Advertisement

తాజా వార్తలు

Advertisement