హైదరాబాద్, ఆంధ్రప్రభ: నదుల అనుసంధానంపై జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (నేషనల్ వాటర్ డెవ లప్ మెంట్ కార్పొరేషన్- ఎన్‌డబ్ల్యూడీఏ) ఇవ్వాల కీలక సమావేశం నిర్వహించనుండగా, తెలంగాణ ప్రభుత్వం మునుపటి వైఖరికే కట్టుబడి ఉంది. తెలంగాణలోని ఇచ్చం పల్లి వద్ద బ్యారేజీ కట్టి కావేరినదిపై గ్రాండ్ ఆనకట్ట వరకు 247 టీఎంసీల నీటిని తరలించేందుకు రూ.85వేల కోట్ల వ్యయం తో ప్రణాళికను రూపొందించింది. రోజుకు 2.2 టీఎంసీల నీటి చొప్పున మళ్ళించే ప్రణాళిక ఉంది. అయితే తెలంగాణ అవస రాలు తీరాకే.. మరో చోటికి తరలించే అంశంపై స్పందిస్తా మని, అప్పటి వరకు తమ నీటిని తరలించేందుకు అంగీక రించబోమని గతంలో తెలంగాణ తేల్చిచెప్పింది. తమ అవ సరాలు తీరకుండా, ప్రయోజనాలు నెరవేరకుండా.. అంగీక రించబోమని గతంలో తెలంగాణ స్పష్టం చేసింది.
కేంద్ర జలశక్తి కార్యదర్శి పంకజ్ కుమార్ అధ్యక్షతన ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో నిర్వహించే సమావేశంలో ఏపీ, తెలం గాణతో సహా నదుల అనుసంధాన భాగస్వామ్య రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. సమావేశంలో దేశంలోని నాలుగు అనుసంధాన ప్రక్రియలపై కీలకంగా చర్చిస్తుండగా దానిలో గోదావరి- కృష్ణా- పెన్నా- కావేరి అను సంధానం కూడా ఉంది. దామన్‌గంగా- పింజల్- పార్- తాపి – నర్మద నదుల అనుసంధానం ద్వారా మహారాష్ట్ర- గుజరాత్‌లకూ, కెన్- బెట్వా అనుసంధానం ద్వారా ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లకూ, కోసి- మెచి ప్రాజెక్టు ద్వారా బీహార్ కూ, గోదావరి (ఇచ్చంపల్లి)- కావేరి (గ్రాండ్ ఆనక) అనుసం ధానం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులకు సాగు, తాగునీటి ప్రయోజనాలను కల్పించేందుకు జాతీయస్థాయిలో విధి విధానాలను ఖరారు చేసినట్టు- ఎన్‌డబ్ల్యూడీఏ చె బుతోంది. ఈ నాలుగు అనుసంధాన ప్రక్రియలను వి జయవంతంగా పూర్తి చేయగలిగితే జాతీయ స్థా యి లో నదుల అనుసంధాన ప్రక్రియకు మార్గసూచి ఏర్ప డుతుందని కేంద్ర జలశక్తి ఇప్పటికే ప్రకటించింది.
గోదావరి-కావేరీ ఏదీ దారి?
అన్నిటికి మించి గోదావరి-కావేరి అనుసం ధానమే క్లిష్టంగా మారుతోందనీ.. భాగస్వామ్య రాష్ట్రాల్రైన ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావాల్సిన చారిత్రిక అవసరాలను గుర్తించాలనీ, గోదావరి, కృష్ణా, కావేరి -టైబ్యునళ్ల అవార్డులను పరిగణలోకి తీసుకోవాలని కేంద్రం కోరుతోంది. కేంద్రం ఎన్నిసార్లు ఏకాభిప్రాయానికి ప్రయత్నించినా ప్రతిపాదిత గోదావరి- కావేరి అనుసంధానంపై రాష్ట్రాలకున్న అనుమానాలను మాత్రం నివృత్తి చేయలేదు. అభ్యంతరాలకు సాంకేతికంగా హేతుబద్ధమైన సమాధానం కూడా లభించలేదని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. అందువల్లనే బుధవారం నిర్వహించే వర్చువల్ సమావేశంలోనూ తమ వాదనలను బలంగా వినిపించేందుకు ఏపీ, తెలంగాణతో పాటు- మిగతా రాష్ట్రాల్రు సిద్ధంగా ఉన్నాయి.
ఇదీ.. అనుసంధాన ప్రణాళిక
రోజుకు 2.2 టీ-ఎంసీల చొప్పున 143 రోజుల్లో మొత్తంగా 247 టీఎంసీల వరద నీటిని ఎత్తిపోసి నాగార్జునసాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా), గ్రాండ్ ఆనకట్ట (కావేరి) వరకు తరలించేలా ఇచ్చంపల్లి వద్ద బ్యారేజి నిర్మించేలా ఎన్‌డబ్ల్యూడీఏ సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) రూపొందించి అన్ని రాష్ట్రాలకు పంపించింది. తెలంగాణలోని ఇచ్చంపల్లి వద్ద మిగులుగా ఉన్న 175 టీ-ఎంసీలు, చత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి బేసిన్‌లో మిగులుగా ఉన్న 72 టీ-ఎంసీలు.. మొత్తం 247 టీ-ఎంసీల తరలించాలనేది ఎన్‌డబ్ల్యూడీఏ ప్రణాళిక. ఎత్తిపోసి తరలించే నీటిలో ఏపీకి 81, తెలంగాణకు 66, తమిళనాడుకు 83 టీ-ఎంసీలను ఇవ్వాలని ముసాయిదా డిజైన్‌ను రూపొందించారు. దీనిపై ఛత్తీస్‌గఢ్, కర్ణాటకతో పాటు- కేరళ, పాండిచ్చేరి, మహారాష్ట్రలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఏపీ, తెలంగాణలకే కాకుండా తమకు కూడా కావేరికి మళ్లించే నీటిలో వాటా కావాలని కర్ణాటక డిమాండ్ చేస్తోంది. ఇంద్రావతిలో తమకు కేటాయించిన నీటిని వినియోగం కావటం లేదన్న సాకుతో కావేరికి మళ్లించటం ఏ మాత్రం హేతుబద్ధం కాదని చత్తీస్‌గఢ్ వాదిస్తోంది. అసలు గోదావరిలో నీటి లభ్యతపై సాధికారికంగా లెక్కలు తేల్చకుండా అనుసంధాన ప్రక్రియకు శ్రీకారం చుడితే తాము నష్టపోతామని తెలుగు రాష్ట్రాలు చెబుతున్నాయి. గోదావరి, కృష్ణా బోర్డుల ద్వారా తమ ప్రాజెక్టులపై పెత్తనానికి ప్రయత్నిస్తున్న కేంద్రం తీరుపై ఆగ్రహంగా ఉన్న తెలంగాణ.. ఈ అనుసంధాన ప్రాజెక్టుకు సహకరించే అవకాశాలు ఇప్పటికిపుడు కనిపించడం లేదని అధికారవర్గాలు అంటున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..