భారీ వర్షాలు, వరదలతో గోదారమ్మ మహోగ్ర రూపం దాల్చింది. నదిలోకి వరద పోటెత్తడంతో భద్రాచలం వద్ద అంతకంతకూ నీటిమట్టం పెరుగుతోంది. ఉదయం 9గంటల సమయంలో 49 అడుగులు దాటిన వరద ఉధృతి.. సాయంత్రం 4 గంటలకు 53అడుగులకు చేరింది. మరికొన్ని గంటల్లో ఇంకా ప్రమాద స్థాయికి చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నదిలో వరద ప్రవాహం భారీగా పెరగడంతో స్నానఘట్టాలు మునిగిపోయాయి. నది దిగువన ఉన్న ముంపు మండలాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.