Tuesday, November 26, 2024

మేకల కోసం బియ్యం సంచులతో రెయిన్ కోట్.. వైరల్ అవుతోన్న వీడియో

తాను పెంచుకుంటోన్న మేకల కోసం రెయిన్ కోట్ ని తయారు చేశాడు ఓ రైతు.. దాంతో అతను అందరి మన్ననలను అందుకుంటున్నాడు. తమిళనాడులోని తంజావూర్‌లో ఒక గ్రామంలో ఒక రైతు తన మేకల కోసం బియ్యం బస్తాలను ఉపయోగించి తాత్కాలిక రెయిన్‌కోట్‌లను తయారు చేశాడు. వర్షాకాలంలో మేత వేసేటప్పుడు అవి వెచ్చగా.. వానతో ఇబ్బందులు పడకుండా చేశాడు. ఆ రైతు తన మేకల కోసం ఇలా రెయిన్ కోట్ లు తయారు చేయడం ఇప్పుడు ఈ ప్రాంతంలో అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.తన మేకలు తన పొలంలో మేత మేయడానికి సంచరించే సమయంలో వానలు, చలి కారణంగా ఇబ్బంది పడకుండా ఇలా చేశానని 70 ఏళ్ల గణేశన్ అనే రైతు చెప్పారు.

ఆయన తన పొలంలో మేకలతో పాటు ఆవులు, కోళ్లను కూడా పెంచుకుంటున్నారు. గణేశన్ తన జంతువులతో చాలా అనుబంధం కలిగి ఉన్నారు. వర్షాకాలం కారణంగా నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నందున తన మేకలు మేత మేసేటప్పుడు చాలా చల్లగా ఉండటంతో వణుకుతున్నాయని గమనించారు. వాటికి కలుగుతున్న ఇబ్బందిని దూరం చేయాలని నిర్ణయించుకున్న గణేశన్ తన మేకలకు బియ్యం బస్తాలను రెయిన్‌కోట్‌లుగా మార్చాడు. తోటి గ్రామస్తులు మొదట్లో ఈ విషయంపై ఆశ్చర్యం వ్యక్తం చేసినప్పటికీ.. మేకల పట్ల గణేశన్ చూపిన శ్రద్ధను వారు అభినందించారు. చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఇప్పుడు ఆ రైతు చేసిన పనిని మెచ్చుకుంటున్నారు.

https://twitter.com/KRISHNA_SGK_/status/1592697669088337920
Advertisement

తాజా వార్తలు

Advertisement