కుమ్ర భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రభ న్యూస్): మేక కడుపులో ఓ వింత ఆకారంలో ఉన్న పిల్ల పుట్టింది. ఇది సేమ్ టు సేమ్ మనిషి రూపంలో ఉండడంతో ఆ మేక యజమాని, కుటుంబం ఆందోళనకు గురయ్యింది. ఈ ఘటన ఇవ్వాల (శనివారం) రాత్రి కుమ్రభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది. దీంతో ఆ వింత జీవిని చూడ్డానికి జనం పెద్ద ఎత్తున తరలిరావచ్చారు.
రెబ్బన మండలం దేవులగూడ గ్రామంలో తుకారాం అనే రైతు ఇంట్లో మేకకు మనిషి రూపంలో కాళ్లు, చేతులు, తల, వెంట్రుకలతో వింతైన జీవి జన్మించింది. శనివారం రాత్రి సమయంలో నొప్పులతో మేక గట్టి అరుస్తూ వింతైన జీవికి జన్మనిచ్చింది. పుట్టిన పిల్ల రెండు నుంచి మూడు నిమిషాల వ్యవధిలో చనిపోయింది. అయితే.. వింత ఆకారంలో ఉన్న జీవిని చూసి యజమాని కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. పశువుల డాక్టర్‌కు ఫోన్‌లో సమాచారం అందించారు. పశువైద్యాధికారులు వింత జీవిని పరీక్షించిన తర్వాత పూడ్చిపెట్టారు.
జన్యుపరమైన లోపం వల్లే: పశువుల డాక్టర్ సురేష్
జన్యు పరమైన సమస్యల వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. భయపడవలసిన అవసరం లేదుభయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. జంతువులలో కొన్ని జన్యుపరమైన సమస్యలు వచ్చినప్పుడు జంతువులకు ఇలాంటి ఆకారంతో వింతలు జరుగుతాయి ప్రజలు అపోహలతో భయపడవలసన పని లేదు. ఇంతకుముందు కూడా ఇట్లాంటి ఘటనలు జరిగాయని తెలిపారు.