Tuesday, November 26, 2024

వివాదంలో యువ‌రాజ్ సింగ్.. నోటీసులు జారీ చేసిన గోవా ప‌ర్యాట‌క‌శాఖ‌

అధికారుల అనుమ‌తి లేకుండానే మోర్జిమ్ లోని త‌న విల్లాను గెస్ట్ ల‌కోసం అద్దెకు ఇవ్వ‌నున్న‌ట్లు ఆన్ లైన్ లో పెట్ట‌డంపై క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ కి గోవా ప‌ర్యాట‌క‌శాఖ నోటీసులు జారీ చేసింది. రిజిస్ట్రేషన్ ఆఫ్ టూరిస్ట్ ట్రేడ్ యాక్ట్ 1982 ప్రకారం… గోవాలో హోమ్ స్టే (పేయింగ్ గెస్ట్) ఇవ్వాలంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 18నఉత్తర గోవాలోని మోర్జిమ్ ప్రాంతంలోని ‘కాసా సింగ్’ పేరిట ఉన్న యువరాజ్ విల్లా అడ్రస్కు టూరిజం శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజేష్ కాలే పేరిట నోటీసు జారీ అయ్యింది. డిసెంబర్ 8 ఉదయం 11 గంటలకు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని అందులో అధికారులు తెలిపారు. టూరిజం యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నందున జరిమానా లక్షలు వరకు ఎందుకు విధించకూడదో చెప్పాలని ప్రశ్నించారు. ప్రతి వ్యక్తి హోటల్ లేదా గెస్ట్ హౌస్ కార్యకలాపాలు నిర్వహించాలంటే కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందేనని గోవా టూరిజం శాఖ స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement