Wednesday, November 20, 2024

గోవా.. భారతీయత భేష్‌! పోర్చుగల్‌ పాలించినా.. మరిచిపోలేదు: లిబరేషన్‌ డేలో ప్రధాని మోడీ

పనాజీ : దేశంలో ఎక్కువ భాగం మొఘలాయిల పాలనలో ఉన్న సమయంలో.. గోవా పోర్చుగల్‌ వారి పాలన కిందికి వెళ్లిందని, ఇది గడిచి ఎన్నో ఎళ్లయ్యిందని, అయినా గోవా వాసులు భారతీయతను మరిచిపోలేదని ప్రధాని మోడీ అన్నారు. గోవాను భారతీయులు కూడా గుర్తుపెట్టుకున్నారని చెప్పుకొచ్చారు. గోవా లిబరేషన్‌ డే ఉత్సవాల్లో భాగంగా ప్రధాని మోడీ ఆదివారం గోవాలో పర్యటించారు. అక్కడ జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

గుడ్‌ గవర్నెన్స్‌తో పాటు ఇతర అంశాల్లో గోవా ప్రగతి చాలా బాగుందన్నారు. గోవా ప్రజలు శాంతియుతంగానే మెలుగుతున్నారని, క్వీన్‌ కెతావన్‌ అవశేషాన్ని చాలా ఏళ్ల పాటు భద్రపరిచారని, గోవా ప్రజలను ఎంత ప్రశంసించినా తక్కువే అని మోడీ చెప్పుకొచ్చారు. వాటికన్‌ సిటీ పర్యటన గురించి చెబుతూ.. చాలా రోజుల క్రితం నేను ఇటలీ, వాటికన్‌ సిటీ వెళ్లా. పోప్‌ను కలుసుకున్నా.. భారత్‌లో పర్యటించాలని ఆహానించా. అప్పుడు పోప్‌ స్పందిస్తూ.. మీరు నాకిచ్చిన అద్భుతమైన బహుమతి ఇదే.. మన దేశ ప్రజాసామ్యం, వైవిధ్యత విషయంలో పోప్‌కున్న అపారమైన ఆదరణ ఇది అని మోడీచెప్పుకొచ్చారు.

పలువురికి సత్కారం
గోవాలోని శ్యామప్రసాద్‌ ముఖర్జీ స్టేడియంలో జరిగిన గోవా విమోచన దినోత్సవంలో భాగంగా.. భారత్‌ భూభాగాలు అయిన గోవా, డామన్‌ అండ్‌ డయ్యూ ప్రాంతాల విముక్తి కోసం పోరాడిన వారిని, 1961లో ఆపరేషన్‌ విజయ్‌లో పాల్గొన్నవారిని మోడీ సత్కరించారు. ఆజాద్‌ మైదాన్‌లోని ఆపరేషన్‌ విజయ్‌ అమరవీరుల స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించారు. మిరామార్‌ బీచ్‌లో గోవా బీచ్‌లో ఏర్పాటు చేసిన సేల్‌ పరేడ్‌, ఫ్లై పాస్ట్‌లో పాల్గొన్నారు.

అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దీనికి ముందు స్టేడియానికి చేరుకున్న మోడీకి సీఎం ప్రమోద్‌ సావంత్‌ స్వాగతం పలికారు. న్యూ సౌత్‌ డిస్ట్రిక్‌ హాస్పిటల్‌, పునరుద్ధరించిన అగౌడ జైలు మ్యూజియం, గోవా మెడికల్‌ కాలేజీ సూపర్‌ స్పెషాలిటీ సెక్షన్‌తో వివిధ ప్రాజెక్టులను ప్రారంభించారు. మోపా విమానాశ్రయంలో ఏవియేషన్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభించారు. అదేవిధంగా మాండ్‌గావ్‌లోని డిబోనేషనల్‌ యూనివర్సిటీలో ఉన్న గ్యాస్‌ సబ్‌ స్టేషన్‌ను కూడా మోడీ ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement