Saturday, November 23, 2024

గోవాలో తొలి ఒమిక్రాన్ కేసు – ఎనిమిదేళ్ళ బాలుడికి ఒమిక్రాన్

రోజు రోజుకి ఒమిక్రాన్ కేసులు పెరుగుతూనే ఉంది. కాగా గోవాలో ఎనిమిదే ఏళ్ల బాలుడికి ఒమిక్రాన్ గా నిర్ధార‌ణ అయింది. ఈ బాలుడు ఈ నెల 17న యూకే నుండి వ‌చ్చాడు. యూకే ఎయిర్ పోర్టులో నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో నెగెటివ్ గా తేలడంతో ఇండియాకి వ‌చ్చాడు. ఇక్క‌డికి వ‌చ్చిన త‌ర్వాత ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఈ టెస్టుల్లో ఆ బాలుడికి కోవిడ్ పాజిటివ్ రావడంతో… అతని శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించారు. ఈ పరీక్షల్లో అతనికి ఒమిక్రాన్ సోకిందని నిర్ధారణ అయింది. గోవాలో ఒమిక్రాన్ కేసు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో, గోవా ప్రభుత్వం అప్రమత్తమైంది. అతనికి కాంటాక్టులోకి వచ్చిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు .

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement