Saturday, November 23, 2024

దేశీయంగా ఉన్న ప్రాంతాల‌ను ఇష్ట‌ప‌డుతోన్న 61శాతం మంది భార‌తీయులు

ప‌ర్యాట‌కులు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే ప్ర‌దేశం అంటే బీచ్ ఉన్న ప్ర‌దేశాల‌నే చెప్పాలి. మ‌న ఇండియాలో గోవా బీచ్ ల‌నే ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతున్నార‌ట జ‌నాలు. ఈ మేర‌కు హోట‌ల్స్ బుకింగ్ సేవ‌ల సంస్థ ఓయో వెల్ల‌డించింది. ఓయో ట్రావెలో పీడియా పేరిట ఒక స‌ర్వేని నిర్వ‌హించింది. ఇక 61శాతం మంది భార‌త ప‌ర్యాట‌కులు ఈ ఏడాది దేశీయంగా ఉన్న ప్రాంతాల‌ను సంద‌ర్శించేందుకు ఇష్ట‌ప‌డుతున్నార‌ని , 2022లో దేశ‌, విదేశీ ప్రాంతాల‌ను చుట్టి రావాల‌నేది త‌మ ఆలోచ‌న అని 25శాతం మంది చెప్పార‌ట‌.


కరోనా మహమ్మారి దృష్ట్యా పర్యటనల సమయంలో భద్రత తమకు ఆందోళన కలిగించే అంశంగా సర్వేలో పాల్గొన్న వారు తెలిపారు. బూస్టర్ డోస్ అందుబాటులోకి వస్తుండంతో పర్యటనకు వెళ్లడానికి ఆటంకం ఉండబోదని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.2022లో ఏ ప్రాంతాలకు మీ ఓటు అని అడగ్గా.. మూడింట ఒక వంతు మంది గోవా అని చెప్పారు. ఆ తర్వాత మనాలి, దుబాయి, సిమ్లా, కేరళ రాష్ట్రాలను ఎక్కువ మంది చెప్పారు. ఆ తర్వాత మాల్దీవులు, ప్యారిస్, బాలి, స్విట్జర్లాండ్ వెళ్లాలనుకుంటున్నట్టు కొందరు పేర్కొన్నారు. భాగస్వాములతో కలసి వెళతామని 37 శాతం మంది తెలిపారు. సన్నిహిత స్నేహితులతో వెళతామని 19 శాతం చెప్పగా.. కుటుంబ సభ్యులతో కలసి వెళతామని 16 శాతం మంది తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement