Sunday, November 3, 2024

మార్కెట్ లోకి ఫైబ‌ర్ సిలిండ‌ర్లు : ధ‌ర ఎంతో తెలుసా

ఇప్పుడు టెక్నాల‌జీ ఎంత‌గానో అభివృద్ధి చెందుతోంది.. ఎంతోక‌ష్ట‌త‌రం అనుకున్న ప‌నులు కూడా ఎంతో ఈజీగా చేయ‌గ‌లుగుతున్నారంటే అది టెక్నాల‌జీ పుణ్య‌మే. అదే టెక్నాల‌జీని ఉప‌యోగించి పైబ‌ర్ గ్యాస్ సిలిండ‌ర్ల‌ని రూపొందించారు. బ‌రువు త‌క్కువ కానీ ధ‌ర ఎక్కువ‌. మ‌రి పైబ‌ర్ గ్యాస్ సిలిండ‌ర్ల గురించి తెలుసుకుందామా.. ప్ర‌స్తుతం గ్యాస్ సిలిండ‌ర్లు అంటే అతి బరువుగా ఉంటాయి. ఎందుకంటే ఇవి ఇనుముతో త‌యారు చేసిన‌వి కాబ‌ట్టి. మ‌రి ఫైబ‌ర్ అంటే ఎంత తేలిక‌గా ఉంటుందో తెలుసుగా.. అంతేకాదు ఫైబ‌ర్ వ‌ల్ల తుప్పుప‌డుతుంద‌నే బాధ‌కూడా త‌ప్పుతుంది. చమురు సంస్థలు కొత్త సిలిండర్ ను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. ఇనుముకు బదులు ఫైబర్ తో తయారు చేసిన సిలిండర్లను విడుదల చేశాయి. ప్రస్తుతానికి ఇండేన్ ఈ ఫైబర్ (స్మార్ట్) సిలిండర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇంట్లో ఇప్పుడు వాడే సిలిండర్లలో గ్యాస్ బరువు 14.2 కిలోలు కాగా.. సిలిండర్ బరువే 16 కిలోల వరకు ఉంటుంది. వీటికి బదులుగానే ఫైబర్ సిలిండర్లను ఇండేన్ తీసుకొచ్చింది.ప్రస్తుతానికి 10 కిలోలు, 5 కిలోల సిలిండర్లే అందుబాటులోకి వ‌చ్చాయి. వాటి ధర కూడా ఎక్కువే. 10 కిలోల ఫైబర్ సిలిండర్ కు రూ.3,350 కాగా.. 5 కిలోల సిలిండర్ ధర రూ.2,150గా ఉంది. కావాలనుకునేవారు ఇప్పటికే ఉన్న సిలిండర్లను ఇచ్చేసి ఈ సిలిండర్లను మార్చుకోవచ్చని ఇండేన్ సంస్థ ప్రకటించింది. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో జరుగుతున్న ‘గో ఎలక్ట్రిక్ ఎక్స్ పో’లో భాగంగా వీటిని సంస్థ ప్రదర్శించింది. బుక్ చేసుకున్న గంటల్లోనే ఇంటికి పంపిస్తామని అధికారులు చెప్పారు. 10 కిలోల సిలిండర్ లో రూ.670, 5 కిలోల సిలిండర్ లో రూ.330 పెట్టి గ్యాస్ ను నింపుకోవచ్చు. ఫైబ‌ర్ సిలిండ‌ర్లు బ‌రువు తక్కువ. గరిష్ఠంగా 6.3 కిలోలు (గ్యాస్ లేకుండా), మామూలు సిలిండర్లలో గ్యాస్ కనిపించదు. వీటిలో కనిపిస్తుంది. కాబట్టి గ్యాస్ ఎప్పుడు అయిపోయేది మనం తెలుసుకునేందుకు వీలుంటుంది. ఇనుప సిలిండర్ కు మంటలు అంటుకుంటే పేలే ప్రమాదం ఉంటుంది. కానీ, ఫైబర్ సిలిండర్ తో ఆ ప్రమాదం ఉండదు.ఇనుప సిలిండర్ తుప్పు పట్టి పాడవుతుంది. మరకలూ పడతాయి. ఫైబర్ సిలిండర్ తో ఈ సమస్యలుండవు. మ‌రి ఇన్ని సౌక‌ర్యాలు ఉన్నాయి కాబ‌ట్టే దీని ధ‌ర కూడా ఎక్కువే మ‌రి. రానున్న కాలంలో వీటి వినియోగం ఎక్కువ‌వుతుంద‌న్న ధీమాతో ఉన్నాయి చ‌మురు సంస్థ‌లు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement