పెట్ డాగ్స్‌తో ఉండే రిలేషన్, అనుబంధం మాటల్లో చెప్పలేనిది. అన్ని జంతువుల్లో కుక్క ఎంత విశ్వాసంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ మధ్య పెట్ డాగ్స్‌పై వస్తున్న సినిమాల కూడా చాలా సక్సెస్ అవుతున్నాయి. 777 చార్లీ మూవీ అయితే సైలెంట్‌గా రిలీజ్ అయ్యి.. బంపర్ హిట్ కోట్టేసింది..
కాగా, బుక్‌మై షోలో దీనికి 97 పర్సంటేజ్ లైక్ చేశారంటే మామూలు విషయం కాదు. ఇక ఈ మధ్యనే ఈ సినిమా చూసిన కర్నాటక సీఎం బస్వరాజు బొమ్మై కూడా కన్నీరు పెట్టుకున్నారు. ఈ మూవీ చూస్తుంటే తన పెంపుడు కుక్క గుర్తుకు వచ్చిందని మీడియాకు చెప్పాడు..
అయితే ఇక్కడో వీడియో ఉంది. ఇందులో ఒకతను దబ్బనిమ్మపండుని పదునైన కత్తితో ముక్కలుగా కోస్తున్నాడు. ఆ పక్కనే పెట్ డాగ్ ఉంటుంది. అతను స్లయిస్ కోస్తుంటే అది అతని చేతిపై కాలుతో తడుతుంది. అంటే తనకు ఒక ముక్క ఇవ్వమని కోరినట్టు అర్థం చేసుకోవాలి..
అప్పుడు ఆ కత్తికి అంటుకున్న ముక్కను తీసి దాని నోట్లో పెడతాడు.. ఇక ఆ పుల్లని నిమ్మపండు ముక్క నోట్లో పెట్టుకుని కాస్త నమలగానే దాని నోరంతా పుల్లటి రసంతో అదోలా అవుతుంది. దాంతో ఆ డాగ్ యజమాని ముసి ముసిగా నవ్వుకుంటూ ఉంటాడు.. అంతలోనే ఆ కుక్క అతని తలపై కాళ్లతో తడుముతూ తనకు కావాలనే పుల్లటి పండుని అందించాడని.. ఆట పట్టించాడని అలా తడమడం అందరినీ బాగా ఇంప్రెస్ చేస్తుంది.. ఫన్నీగా ఉన్న ఈ వీడియోని మీరూ చూసి కాసేపు నవ్వుకోండి..