కరోనా టీకాల సరఫరాకు తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 21 నుంచి ఆన్లైన్ ద్వారా టెండర్ల దాఖలుకు అవకాశం ఇవ్వగా.. జూన్ 4 చివరి తేదీగా తెలిపింది. 6 నెలల్లో కోటి డోసుల వ్యాక్సిన్ను సరఫరా చేయాలని నిబంధన విధించింది. సప్లయర్ నెలకు 15లక్షల డోసులను విధిగా సరఫరా చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం 4 కోట్ల మందికి వ్యాక్సిన్ను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement