ఇండియాలో పిల్లలను కనడమే పనిగా పెట్టుకున్నారని, అందుకని ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని జనాభా దేశంలో పెరుగుతోందని తెలుస్తోంది. యూత్ మొత్తం ఇదే పనిలో నిమగ్నై ఉంటే ఇక జనాభా పెరగకుండా ఏమైతుందని పరిశీలకులు అంటున్నారు. దీనిపై యునైటెడ్ నేషన్స్ ఇవ్వాల (సోమవారం) ఓ రిపోర్టుని వెలువరించింది. భారత దేశం అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో టాప్‌లో నిలుస్తోందని, చైనాని దాటి ఫస్ట్ ప్లేస్‌కి చేరుతోందని ఐక్యరాజ్యసమితి డేటా చెబుతోంది.
– డిజిటల్ మీడియా విభాగం, ఆంధ్రప్రభ
ప్రపంచ జనాభా విపరీతంగా పెరుగుతోందని, వచ్చే నవంబర్15వ తేదీ వరకు 8 బిలియన్లకు చేరుకుంటుందని ఐక్యరాజ్య సమితి (UN) అంచనా వేసింది. అందులో వచ్చే ఏడాది భారత దేశం చైనా జనాభాని అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరిస్తుందని ఓ అధ్యయనం ద్వారా వెల్లడైందని, ఇది జనాభా లెక్కల తీరును పరిశీలిస్తే ఇదే అంశం గమనించవచ్చని యునైటెడ్ నేషన్స్ తెలిపింది.
ఇక.. రాబోయే పదేళ్లలో ప్రపంచ జనాభాలో సగానికి పైగా పెరుగుదల అంచనా.. కేవలం 8 దేశాలలో మాత్రమే ఉంటుందని, అవి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండియా, నైజీరియా, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, టాంజానియా దేశాలుగా ఐక్యరాజ్యసమితి పేర్కొంది.
ప్రపంచ జనాభా ఒక బిలియన్‌కు చేరుకోవడానికి వందల, వేల సంవత్సరాలు పట్టిందని.. కానీ, ఏడు రెట్లు పెరగడానికి కేవలం 200 సంవత్సరాలు మాత్రమే పట్టిందని UN సోమవారం పేర్కొంది. 2011లో ఇది ఏడు బిలియన్లకు చేరినట్టు తెలిపింది.
1950 నుండి ప్రపంచ జనాభా అతి తక్కువ వేగంతో పెరుగుతోందని UN యొక్క ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం అంచనా వేసినప్పటికీ..ఈ మధ్య కాలంలో జనాభా పెరుగుదలలో భారీ వ్యత్యాసం కనిపిస్తోందని, ఇది రాబోయే సంవత్సరాల్లో మరింత ఎక్కువగా ఉంటుందని యునైటెడ్ నేషన్స్ అంచనా వేసింది. దీనికి.. పట్టణీకరణ పెరగడం, వేగవంతంగా వలసలు వంటి అంశాలతో పాటు.. పునరుత్పత్తి వయస్సులో జీవించి ఉన్న వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉండడమే ప్రధాన కారణంగా యుఎన్ అంచనా వేస్తోంది. ప్రపంచ జనాభా 2030లో 8.5 బిలియన్లకు, 2050లో 9.7 బిలియన్లకు చేరుకుంటుందని ఓ నివేదిక అంచనా వేసింది.