హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ డ్రిల్‌మెక్ ఏర్పాటు కానుంది. ఇవాళ ఇటలీకి చెందిన డ్రిల్ మెక్- తెలంగాణ ప్రభుత్వం మధ్య MoU జరగనుంది. ఆయిల్ రిగ్గుల తయారీలో అంతర్జాతీయ స్థాయి సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న డ్రిల్‌మెక్.. 200 మిలియన్ US డాలర్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో గ్లోబల్ ఆయిల్ రిగ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు చేయనుంది. మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) అనుబంధ సంస్థ డ్రిల్‌మెక్. డ్రిల్‌మెక్ సీఈవో అలెక్స్‌కు MoU కాపీని పరిశ్రమలు, ఐటిశాఖ మంత్రి కేటీఆర్ అందజేయనున్నారు. డ్రిల్‌మెక్ ఏర్పాటుతో కొత్తగా 2,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement