కాంగ్రెస్ పార్టీలో చేరబోవడంలేదని..కాంగ్రెస్ కి వ్యూహకర్తగా మాత్రమే పని చేస్తానని స్పష్టం చేశారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. కాగా పార్టీ పగ్గాలను ప్రియాంక గాంధీకి ఇవ్వాలని సూచించారట. గత రెండు వారాలుగా కాంగ్రెస్ అధిష్ఠానంతో ప్రశాంత్ కిశోర్ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. వాస్తవానికి పార్టీలో ఒక కీలకమైన హోదాను పీకే ఆశించారు. అయితే, పార్టీ వ్యూహాలను రూపొందించే సాధికారిక బృందంలో సభ్యుడిగా మాత్రమే ఉండాలని అధిష్ఠానం ప్రతిపాదించడంతో… ఆయన పార్టీలో చేరే ఆలోచనను విరమించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ కు తన కంటే ఎక్కువగా… సంస్థాగత సమస్యలను గుర్తించే నాయకత్వం అవసరమని తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement