రోమ్-అనంత విశ్వంలో ఏం జరుగుతోందోనని టెలిస్కోపుల్లోంచి కళ్లు చిట్లింటి.. నిశిధిలో నిఘావేసి
చూస్తున్న ఇటలీకి చెందిన ఖగోళ శాస్త్ర వేత్త కళ్లు ఇంతయ్యాయి. కలలో కూడా ఊహించని అరుదైన దృశ్యం అలా కళ్లముందు కన్పించేసరికి ఊపిరిబిగబట్టి.. కనురెప్పలు వేయడం మరచి ఉగ్గబట్టి అలా చూస్తూండిపోయాడు. ఇంతకీ ఆయనకు కన్పించిన దృశ్యం ఏమిటి.. ఇదిగో ఇక్కడి ఛాయాచిత్రాన్ని చూడండి.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యుద్ధక్రీడా వినోద కేంద్రం రోమన్ కొలోసియం మీదుగా ఇటీవల అంతరిక్ష ప్రయోగం కేంద్రం దూసుకుపోయింది. ఈ అరుదైన దృశ్యాన్ని ఇటలీకి చెందిన ఖగోళ భౌతిక శాస్త్ర వేత్త గియాన్ లుకా మాసీ తన టెలిస్కోపులో బంధించాడు. కొద్ది క్షణాలపాటు రోమన్ కొలోసియం మీదుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ప్రయాణిస్తున్నప్పుడు ఆ దృశ్యాన్ని చిత్రీకరించాడు.
జీవితకాలంలో ఒకసారి వచ్చే ఇలాంటి అరుదైన ఘట్టాన్ని ఎన్నటికీ మరవలేనంటూ తెగ మురిసిపోయాడు. తను రికార్డు చేసిన దృశ్యాలను, ఛాయాచిత్రాలను సామాజిక మాధ్యమాలలో విడుదల చేశాడు. ఇప్పుడవి వైరల్ అయ్యాయి. ఇటలీలో తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా రోమ్ లోని రోమ్ లోని పురాతన కలోసియమ్, పార్కొ టెలిస్కోప్ కేంద్రం… అంతరిక్షంపై డిసెంబర్ 6-7 తేదీల్లో ఓ కన్నేశాయి. అదే సమయంలో రోమన్ కొలోసియమ్ మీదుగా అంతరిక్ష కేంద్రం దూసుకువెడుతూండటాన్ని కనిపెట్టాయి. వెంటనే అప్రమత్తమై ఆ దృశ్యాన్ని చిత్రీకరించాయి. సాయం సంధ్య వేళ… ఆకాశంలో నెలవంక తొంగి చూసినప్పటినుంచి.. తూర్పున ఉదయభానుడు పొడుచుకొచ్చేవరకు మధ్య ఆకాశంలో అందాలను, మార్పులను… అదే క్షణఆల్లో విద్యుల్లతలా.. అంతరిక్ష కేంద్రం దూసుకువెళ్లడాన్ని దృశ్యకావ్యంలా..కళ్లకు కట్టేలా రికార్డు చేశారు. దాదాపు రెండున్నర వేల ఏళ్లక్రితం నిర్మించిన అతి విశాలమైన, బహుళ అంతస్థుల యుద్ధ క్రీడా వినోద కేంద్రం రోమన్ కొలోసియం ప్రపంచ ప్రఖ్యాత కట్టడం. ఇది ఇటలీలోని రోమ్ నగరంలో నిర్మించారు. కాంతికాలుష్యాన్ని చేధించుకుని.. మినుకుమినుకుమంటున్న తారల కాంతిధాటిని కాదని.. ఈ రోమన్ స్టేడియంనుంచి కళ్లు మిటకరించి.. అరుదైన దృశ్యాన్ని బంధించిన శాస్ర్తవేత్త మాసీ .. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేనని అంటున్నాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..