హైదరాబాద్ నగరంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత భారీగా పెరుగుతుంది. ప్రతిరోజు వందల్లో కేసులు, ఇతర రాష్ట్రాల నుండి చికిత్స కోసం కోవిడ్ రోగులతో వైరస్ వ్యాప్తి పెరుగుతూనే ఉంది. మినీ కంటైన్మెంట్ జోన్లతో వైరస్ స్ప్రెడ్ కట్టడి చేయాలని కేంద్రం సూచించినా గ్రేటర్లో అమల్లోకి రాలేదు. కానీ వైరస్ వ్యాప్తి మరింత పెరిగే ప్రమాదకర సమయంలో ఎట్టకేలకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. కనీసం 5 కేసులుంటే మినీ కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అపార్టుమెంట్లలో ఉంటే హౌజ్ క్లస్టర్‌గా పిలుస్తారని, ఈ ప్రాంతాల్లో నిరంతరం శానిటైజేషన్, వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని జీహెచ్ఎంసీ తెలిపింది. ఇప్పటి వరకు 30 సర్కిళ్లలో 63 మినీ కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటిలో ఎక్కువగా ఎల్బీనగర్, చార్మినార్, ఖైరతాబాద్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్ ప్రాంతాలలో ఉన్నట్లు తెలుస్తోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement