టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్‌లో ఆ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలపై జీహెచ్ఎంసీ అధికారులు జరిమానాలు విధించారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి జరిమానాలకు గురైన వారిలో టీఆర్ఎస్ నేతలు సహా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కూడా ఉన్నారు. ఆయన ఏర్పాటుచేసిన ఫ్లెక్సీపై జీహెచ్ఎంసీ అధికారులు రూ.50 వేల జరిమానా విధించారు. టీఆర్ఎస్ ప్లీనరీని పురస్కరించుకుని ఆ పార్టీ నేతలు నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. భాగ్యనగరంలోని ప్లీనరీ జరిగిన ప్రాంతాలన్నీ ప్లెక్సీ మయం అయ్యాయి. దీంతో వాటిని తొలగించాలని బీజేపీ నేతలు అధికారులను డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం ఈ ఫ్లెక్సీలపై సోషల్ మీడియాలో అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రధాన రహదారులపై ప్లెక్సీలు ఏర్పాటు వల్ల పలు ప్రమాదాలు చోటుచేసుకొనే అవకాశం ఉందంటూ పేర్కొన్నారు. దీంతో ఫ్లెక్సీలపై అధికారులు జరిమానాలు విధించారు. ఇందులో భాగంగా తలసానికి రూ.50 వేలు ఫైన్ వేసిన అధికారులు… మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి కుమారుడు రోహిత్‌కు రూ.40 వేలు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు రూ.5 వేలు, కాలేరు వెంకటేశ్ కు రూ.10 వేలు జరిమానా విధించారు. కాగా, గరంలోని జూబ్లీహిల్స్, కేబీఆర్ పార్క్, పంజాగుట్ట, నాంపల్లి, నారాయణగూడ, చాదర్ ఘాట్, అంబర్ పేట, తార్నాక, ప్యాట్నీ, ఈస్ట్ మారేడ్ పల్లి, మెట్టగూడ తదితర ప్రాంతాల్లో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.
GHMC: టీఆర్ఎస్ ఫ్లెక్సీలపై జరిమానాలు.. మంత్రి తలసానికి రూ.50 వేల ఫైన్
Advertisement
తాజా వార్తలు
Advertisement