జీహెచ్ఎంసీ పరిధిలో పలు సివిల్ ఇంజనీరింగ్ వర్క్ ల ద్వారా నగర అభివృద్ధిలో పాలుపంచుకున్న కాంట్రాక్టర్లు ఉద్యమానికి సిద్ధమయ్యారు. గత ఏడాది ఆగస్టు నుంచి పెండింగ్ లో ఉన్న బిల్లుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ, ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, అధికారుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైనాన్స్ అడిషనల్ కమిషనర్ కెనడీకి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. స్పందించిన కమిషనర్ డా.డీఎస్.లోకేశ్ కుమార్ మార్చి నెలాఖరు లోగా సెప్టెంబర్ వరకు ఉన్న బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఏప్రిల్ నెలలో డిసెంబర్ వరకు బిల్లుల చెల్లింపునకు హామీ ఇవ్వడంతో కాంట్రాక్టర్లు ఆందోళన విరమించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement