గాంధీ హాస్పటల్ లో నేటి నుండి సీటీస్కాన్ యూనిట్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది తెలంగాణ సర్కార్. ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు గాంధీ ఆసుపత్రిలో సీటీస్కాన్ ని ప్రారంభించారు. 45రోజుల్లో MRI, cathalab ప్రారంభిస్తామని మంత్రి హారీష్ రావు కీలక ప్రకటన చేశారు. కరోనా మహమ్మారి సమయంలో గాంధీ ఆసుపత్రి వైద్యులు అద్భుత సేవలు అందించారని కొనియాడారు. ప్రైవేట్ ఆసుపత్రులు చేతులెత్తేసిన కేసులు కూడా గాంధీ ఆస్పత్రిలో సేవలు అందించారన్నారు.
ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ 95 శాతం పూర్తి అయిందని… రెండో డోస్ 51 శాతం నమోదైనట్లు ఆయన వివరించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఓమైక్రాన్ వేరియంట్ రాలేదని… ఎవరూ ఆందోళన చెందనక్కర్లేదన్నారు. విదేశాల నుంచి వచ్చిన 13 మందికి కరోనా నెగటివ్ వచ్చిందని … రెండు కేసులు పెండింగ్ ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో కరోనా టెస్ట్ ల సంఖ్య పెంచుతామన్నారు. ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..