Tuesday, November 26, 2024

జనరల్ రావత్ ప్లేసులో సీడీఎస్ గా జ‌న‌ర‌ల్ మనోజ్ ముకుంద్ న‌ర‌వ‌ణె..

తమిళనాడులోని కూనూర్‌లో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో జనరల్‌ బిపిన్ రావత్‌ ప్రాణాలు కోల్పోయారు. దేశ రక్షణ రంగంలో కీలకమైన సీడీఎస్‌ (చీఫ్‌ డిఫెన్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌) పదవిలో ఉన్న ఆయన ఆకస్మిక మరణంతో తదుపరి సీడీఎస్‌ ఎవరనే చర్చ మొదలైంది. బిపిన్ రావత్ వంటి అనుభవజ్ఞుడు, వ్యూహకర్త ఎవరు? ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ త్రివిధ దళాలను సమన్వయం చేయగలిగే సమర్థుడు ఎవరు? తదుపరి త్రిదళాధిపతిగా ఎవ‌రికి అవకాశం ఉంది.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ అధిపతుల్లో ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది? అన్న విషయాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

రేసులో ఆయనే ముందు..
నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కి ఇటీవలే కొత్త అధిపతులు వచ్చారు. నేవీ చీఫ్‌గా అడ్మిరల్‌ ఆర్. హరికుమార్ 8 రోజుల క్రితమే బాధ్యతలు స్వీకరించారు. ఎయిర్ చీఫ్ మార్షల్‌ వివేక్ రామ్‌ అయితే ఈ ఏడాది సెప్టెంబర్ 30 నుంచి ఎయిర్‌ఫోర్స్ అధిపతిగా ఉంటున్నారు. జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణె మాత్రమే 2019 డిసెంబర్ 31 నుంచి ఆర్మీ అధిపతిగా కొనసాగుతున్నారు. ఇలా చూస్తే బిపిన్‌ తర్వాత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ నరవణె మాత్రమే సీనియర్‌ అధికారి అవుతారు. ఈ క్రమంలో రావత్‌ స్థానంలో నరవణెను నియ‌మించిన‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement