జనరల్ ఎలక్షన్స్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేస్తోంది. 2024లో జరగబోయే లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు ముందస్తు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రేపు (బుధవారం) తెలంగాణకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం రానున్నట్టు తెలుస్తోంది.
ఇక.. హైదరాబాద్‌కు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌కుమార్ రానున్నారు. నాలుగు రోజులపాటు హైదరాబాద్‌లోనే సీఈసీ రాజీవ్‌కుమార్ ఉండబోతున్నారు. తెలంగాణలో ఓటరు జాబితాలు, ఓటర్ల నమోదుకు సంబంధించిన విషయాలు.. ఎక్కువ కాలం ఒకేచోట ఉన్న అధికారుల బదిలీలకు సంబంధించిన విషయాలపై చర్చించే చాన్స్ ఉంది. అంతేకాకుండా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశాలున్నాయి. కాగా, సెప్టెంబర్‌లోనే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.