తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ నేడు జరగనున్నాయి. ఆయనతోపాటు సతీమణి మధులికా రావత్ అంత్యక్రియలు ఢిల్లీలో జరగనున్నాయి. ఉదయం 11 నుంచి 12:30 వరకు సాధారణ ప్రజల సందర్శనకు అనుమతి ఇవ్వనున్నారు. ఆ తర్వాత త్రివిధ దళాలకు చెందిన అధికారులు, సిబ్బంది నివాళులు అర్పించానున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో కామరాజ్ మార్గ్ నుంచి కంటోన్మెంట్ ప్రాంతంలోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటిక వరకు అంతిమ యాత్ర సాగనుంది. సాయంత్రం 4 గంటలకు బిపిన్ రావత్ భౌతికకాయానికి సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
తమిళనాడులోని కోయంబత్తూర్-కూనూర్ మధ్యలో హెలికాప్టర్ ప్రమాదానికి గురై భారత త్రిదళాధిపతి(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ బుధవారం దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మొత్తం 13 మంది చనిపోయారు. వెల్లింగ్టన్ సైనిక కళాశాలలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.