హుజురాబాద్ ఉపఎన్నిక కోసం నామినేషన్ల పర్వం మొదలైంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరుగుతోంది. టీఆర్ఎస్, బీజేపీ నేతల ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ వేశారు. ఆర్డీవో కార్యాలయంలో నామపత్రాలు దాఖలు చేశారు. అక్టోబర్ 8 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంది.
2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్న గెల్లు శ్రీనివాస్‌పై 100కు పైగా కేసులు ఉన్నాయి. ఉద్యమ సమయంలో పలుమార్లు పోలీసులు అరెస్టు అయ్యి జైలు జీవితం గడిపారు. 2017 నుంచి టీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
ఇది కూడా చదవండి: టాటా చేతికి ఎయిరిండియా