గెహ్రైయాన్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అందరి దృష్టి దీపికా పదుకొణె, సిద్ధాంత్ చతుర్వేదిల కెమిస్ట్రీపై పడింది. సినిమాలోని కొన్ని బోల్డ్ సీన్స్‌లో దీపిక, సిద్ధాంత్ ఒకరి చేతుల్లో ఒకరు ఒదిగిపోయినట్టు కనిపిస్తారు. అయితే, ఆ బోల్డ్ సీన్స్ అంత బాగా రావడానికి తెర వెనుక.. వారి ప్రతి కదలికను నిర్దేశించే వ్యక్తి ఉన్నారు.. ఆమే గెహ్రైయాన్ ఇంటిమసీ డైరెక్టర్ దార్ గై..
‘దీపికా, -సిద్ధంత్‌తో కలిసి కొన్ని బోల్డ్ సీన్స్ తీసేందుకు నా దగ్గర చాలా టెక్నాలజీ ఉంది.. అని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో దార్ గై చెప్పుకొచ్చింది. దీపిక, సిద్ధాంత్ సన్నివేశాలకు దర్శకత్వం వహించడం గురించి కొన్ని వివరాలు తెలిపింది. ఇది తనకు ఇష్టమైన ఎక్స్‌పీరియన్స్‌లో ఒకటిగా పేర్కొంది.
“చిలిపిగా అనిపించడం ఇష్టం లేదు. కానీ, ఇది నాకుఎదురైన కొన్ని అనుభవాలలో ఒకటిగా మాత్ర కచ్చితంగా చెప్పగను. మా టెక్నాలజీతోనే మాయాజాలం మొదలవుతుంది. శకున్ (బాత్రా, గెహ్రైయాన్ దర్శకుడు) నమ్మశక్యం కాని డైరెక్టర్. అతనికి సృజనాత్మక శక్తి మాత్రమే కాదు.. క్రాఫ్ట్ పై కూడా పట్టు ఉంది. సిద్ధాంత్, దీపికతో నేను ప్లే చేసిన విధానం ఇప్పుడు అందరినీ ఎంతో ఆకట్టుకుంటోంది..’’ అని వివరించింది.
ఇట్లా ఎందుకు చేయాలి అని దీపిక ఎప్పుడూ అడగలేదు..
‘‘ఆ ప్రాజెక్ట్ కోసం బోర్డులోకి వచ్చినప్పుడు నేహా వ్యాస్ ఇప్పటికే కొన్ని వర్క్ షాప్‌లను నిర్వహించాం. దాని కారణంగా దీపిక, సిద్ధాంత్‌లను కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెట్టాం అనే చెప్పాలి. వాస్తవానికి దీపిక, సిద్ధాంత్ ఎటువంటి సన్నివేశమైనా చాలా ఈజీగా తీసుకుంటారు. అంతే సహకరిస్తారు. కొంతమందికి దీపిక వంటి బ్యూటిఫుల్ యాక్టర్, అనుభవం ఉన్న వ్యక్తులతో వర్క్ చేయడం చాలా సరదాగా ఉంటుంది. అయితే ఎందుకు అలా చేస్తున్నారు? ప్రయోజనం ఏమిటి? అని తను ఎప్పుడూ అడగలేదు. మమ్మల్నీ పూర్తిగా విశ్వసించింది కాబట్టే.. తను మాకు అంతలా సహకరించింది. అందుకే ఈ అద్భుతాన్ని -సృష్టించగలిగాం అని భావిస్తున్నా’’.. అని దార్ గె సినిమా గురించి తెలియజేసింది..