Tuesday, November 26, 2024

‘గౌత‌మ్ రాఘ‌వ‌న్’ కి ప‌దోన్న‌తి క‌ల్పించిన అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్


అమెరికా అధినేత జో బైడెన్ భార‌త సంత‌తికి చెందిన గౌత‌మ్ రాఘ‌వ‌న్ కి ప‌దోన్న‌తిని క‌లిపించారు. వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెన్షియ‌ల్ ప‌ర్స‌న‌ల్ అధిప‌తిగా గైత‌మ్ కి కొత్త బాధ్య‌త‌లు అప్ప‌జెప్పారు. రాఘవ‌న్ వ‌య‌సు 40 ఏళ్ల పైనే. ఆయ‌న స్వ‌లింగ సంప‌ర్కుడు. భ‌ర్త‌, కూతురితో క‌లిసి వాషింగ్ట‌న్ డీసీలో జీవిస్తున్నారు. 2020, జ‌న‌వ‌రి 20 నుంచి అధ్య‌క్షుడికి డిప్యూటీ అసిస్టెంట్‌గా చేశారు. బైడెన్‌-హ్యారిస్ ప‌రిపాల‌నా విభాగం తొలుత రిక్రూట్ చేసింది రాఘ‌వ‌న్‌నే. వైట్‌హౌజ్ పీపీఓను .. ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెన్షియ‌ల్ ప‌ర్స‌న‌ల్‌గా కూడా పిలుస్తారు. అయితే వైట్‌హౌజ్‌లో జ‌రిగే కొత్త అపాయింట్‌మెంట్ల‌ను పీపీవో ఆఫీసు ప‌రిశీలిస్తుంది. శ్వేత‌సౌధంలో ప‌నిచేసే అభ్య‌ర్థ‌ల‌ను పీపీవో ఆఫీసు పూర్తిగా అంచ‌నా వేసి రిక్రూట్ చేస్తుంది.

గౌత‌మ్ రాఘ‌వ‌న్ ప్ర‌స్తుతం పీపీవో డిప్యూటీ డైర‌క్ట‌ర్‌గా చేస్తున్నారు. అయితే వైట్‌హౌజ్ పీపీవో హెడ్ పోస్టులో ఉన్న క్యాథే ర‌స్సెల్‌కు ఇటీవ‌ల కొత్త ప‌ద‌వి ద‌క్కింది. యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైర‌క్ట‌ర్‌గా ర‌స్సెల్ వెళ్తున్నారు. దీంతో ఆయ‌న స్థానంలో ఖాళీ అయిన పోస్టుకు గౌత‌మ్‌ను అప్‌గ్రేడ్ చేశారు. క్యాథే ర‌స్సెల్‌తో క‌లిసి గౌత‌మ్ బాగా ప‌నిచేశార‌ని, పీపీవో కొత్త డైర‌క్ట‌ర్‌గా రాఘ‌వ‌న్ బాధ్య‌త‌లు చేప‌డతార‌ని బైడెన్ చెప్పారు. కాగా గౌత‌మ్ రాఘ‌వ‌న్ పుట్టింది భార‌త‌దేశంలోనే . సియాటిల్‌లో ఆయ‌న‌ పెరిగారు. స్టాన్‌ఫార్డ్ యూనివ‌ర్సిటీలో ఆయ‌న గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశారు. వెస్ట్ వింగ‌ర్స్‌.. స్టోరీస్ ఫ్ర‌మ్ ద డ్రీమ్ చేజ‌ర్స్, చేంజ్‌మేక‌ర్స్‌, హోప్ క్రియేట‌ర్స్ ఇన్‌సైడ్ ద ఒబామా వైట్ హౌజ్ అన్న పుస్త‌కానికి ఆయ‌న ఎడిట‌ర్‌గా చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement