Saturday, November 23, 2024

Richest List 2022 | ఫోర్బ్స్​ ఇండియా సంపన్నుల జాబితా ఇదే​.. టాప్​1లో అదాని, ఆ తర్వాత ఎవరంటే!

భారత దేశంలో అత్యంత సంపన్నుల 100మంది జాబితాను ఫోర్బ్స్​ ఇండియా వెలువరించింది. ఇందులో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ అగ్రస్థానంలో ఉన్నా. ఈ ఏడాది అదానీ సంపద రెట్టింపు కావడంతో ఫోర్బ్స్ ఇండియా యొక్క 100 మంది సంపన్నుల జాబితా 2022లో టాప్​లో నిలిచారు. USD 150 బిలియన్ల నికర విలువతో భారతీయ వ్యాపారవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) చైర్మన్ అండ్​ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీని అదాని అధిగమించారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన 100 మంది సంపన్నుల జాబితా ప్రకారం భారతదేశంలోని టాప్ 10 బిలియనీర్ల నికర విలువ USD 385.2 బిలియన్లు. ఇది 2021లో ఉన్న దానికంటే 15.1 శాతం ఎక్కువ. ఐదుగురు బిలియనీర్లు తమ నికర విలువలో నష్టాలను చవిచూస్తున్నారు. టాప్ టెన్ క్లబ్‌లో ఉన్న ఐదుగురు బిలియనీర్లు వారి సంపద తగ్గుతూ వచ్చింది. ఇందులో శివ నాడార్, లక్ష్మీ మిట్టల్, ముఖేష్ అంబానీ వంటి ముగ్గురు బడా వ్యాపారవేత్తలకు పెద్దమొత్తంలో ఈ ఏడాది సంపద తగ్గుదల నమోదైంది.

ఈ సంవత్సరం తన రికార్డు సంపదను విరాళంగా ఇచ్చిన శివ్ నాడార్ USD 9.6 బిలియన్లకు పడిపోయారు. అతని సంపద రికార్డు స్థాయిలో క్షీణించినప్పటికీ, టాప్ 10 జాబితాలో స్థానాన్ని నిలబెట్టుకోగలిగారు. ఇక.. 2013 నుండి దేశంలో అత్యంత సంపన్నుడిగా ఉన్న ముఖేష్ అంబానీ ఆ టైటిల్ కోల్పోవడంతో అదానీ టాప్​ వన్​గా నిలిచారు. ప్రముఖ వ్యాపారవేత్త లక్ష్మీ మిట్టల్​కు 2013 తర్వాత తొలిసారిగా భారతదేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో చోటు దక్కలేదు.

గౌతమ్ అదానీ, ఇతర టాప్ గెయినర్లు..

- Advertisement -

గౌతమ్ అదానీ దేశంలో అత్యంత ధనవంతుడు కావడమే కాకుండా టాప్ గెయినర్‌గా కూడా ఎదిగారు. అతను ఒక సంవత్సరంలో USD 75.2 బిలియన్లను సంపాదించారు. అంతేకాకుండా పార్లే ప్రొడక్ట్స్ చైర్మన్ విజయ్ చౌహాన్ ర్యాంక్ గణనీయంగా మెరుగుపడింది. అతను ఈ సంవత్సరంలో రెండో అత్యధిక లాభం పొందిన వ్యక్తిగా నిలిచారు. అతని ర్యాంక్ 72 నుండి 33కి మెరుగుపడింది. జ్యువెలరీ బ్రాండ్ జోయాలుక్కాస్ చైర్మన్, ఎండీ అయిన జాయ్ అలుక్కాస్ 2013 తర్వాత తొలిసారిగా మళ్లీ సంపన్నుల జాబితాలోకి వచ్చారు. 2022లో దేశంలోని 100 మంది సంపన్నుల సంపద USD 800 బిలియన్లకు చేరుకుంది. వీరిలో తొమ్మిది మంది మహిళా బిలియనీర్లు కూడా ఉన్నారు.

ఫోర్బ్స్ ఇండియా యొక్క 100 మంది సంపన్నుల జాబితా.. 2022లో కొత్తవారు

2022లో ఫోర్బ్స్ ఇండియా యొక్క 100 మంది సంపన్నుల జాబితాలోకి తొమ్మిది మంది కొత్తవారికి అవకాశం దక్కింది. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌కు చెందిన షాపూర్ మిస్త్రీ కొత్తవారి జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. ఆమె దివంగత భర్త రాకేష్ ఝున్‌ఝున్‌వాలా స్థానంలో వచ్చిన రేఖా ఝున్‌ఝున్‌వాలా కూడా కొత్తవారే. ఇతర కొత్తవారు వకీల్ ఫ్యామిలీ, ఫల్గుణి నాయర్, రవి మోడీ, సత్యన్నారాయణ నువాల్, నిర్మల్ మిండా, రఫీక్ మాలిక్,  వేణు శ్రీనివాసన్ ఉన్నారు.

జాబితాలో అతి చిన్న వయస్కులైన భారతీయ బిలియనీర్లు..

BYJU’s వ్యవస్థాపకులలో ఒకరు దివ్య గోకుల్‌నాథ్ జాబితాలో ఉన్న అతి పిన్న వయస్కురాలైన భారతీయ బిలియనీర్​గా రికార్డులకు ఎక్కారు. ఆమె వయస్సు 36 సంవత్సరాలు. బైజు రవీంద్రన్, దివ్య గోకుల్​నాథ్​ నికర విలువ USD 3.6 బిలియన్లు. జాబితాలో అత్యంత పాత బిలియనీర్లు శ్రీ సిమెంట్ చైర్మన్, సోనాలికా గ్రూప్ వ్యవస్థాపకుడు లచ్‌మన్ దాస్ మిట్టల్, డీఎల్‌ఎఫ్‌కి చెందిన కుశాల్ పాల్ సింగ్ కూడా ఉన్నారు. వారి వయస్సు 91సంవత్సరాలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement