గ్యాస్ ట్యాంకర్ పేలి నలుగురు సజీవదహనమైన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని అజ్మీర్ జిల్లాలోని జాతీయ రహదారిపై గ్యాస్ ట్యాంకర్, లారీ ఎదురెదురుగా వెళ్తూ వేగంగా ఢీకొన్నాయి. దీంతో గ్యాస్ ట్యాంకర్ పేలిపోయి ఒక్కసారిగా రెండు వాహనాలకు మంటలు అంటుకోవడంతో.. వాటిలో ఉన్న నలుగురు సజీవదహనమయ్యారు. రెండు భారీ వాహనాలు ఎదురెదురుగా ఢీకొనగానే ట్యాంకర్ పేలిపోయి మంటలు అంటుకున్నాయని, ఇదంతా క్షణాల్లో జరిగిపోవడంతో ఆ రెండు వాహనాల్లో ఉన్న నలుగురు తప్పించుకోవడానికి అవకాశం లేకుండాపోయిందని, దాంతో సజీవ దహనమయ్యారని పోలీసులు తెలిపారు. ట్యాంకర్లోని పెట్రోలియం గ్యాస్ చిల్లడంతో ఆ సమయంలో ఆ మార్గం గుండా వెళ్తున్న ఇతర వాహనాలకు, సమీపంలోని ఇండ్లు, దుకాణాలకు కూడా స్వల్పంగా మంటలు అంటుకున్నాయని చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement